- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భూమన అరాచకాలు: ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సంఘాలు
తిరుమలలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అరాచకాలు కొనసాగుతున్నాయని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ అన్నారు. తిరుమలలో వైసీపీ నేతలు అక్రమంగా దుకాణాలు కొగిస్తున్నారని, ఇందుకు అధికారులు సైతం వత్తాసు పలుకున్నారని ఆయన ఆరోపించారు. ..

దిశ వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి(YCP leader Bhumana Karunakar Reddy) అరాచకాలు కొనసాగుతున్నాయని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ అన్నారు. తిరుమలలో వైసీపీ నేతలు అక్రమంగా దుకాణాలు కొనసాగిస్తున్నారని, ఇందుకు అధికారులు సైతం వత్తాసు పలుకున్నారని ఆయన ఆరోపించారు. తిరుమల బాలాజీ నగర్ నివాసిత ప్రాంతాల్లో భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా దుకాణాలు పెట్టించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా తిరుమలలో మాత్రం టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధికారమే నడుస్తోందని చెప్పారు. ఈ అక్రమ దుకాణాలపై అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన దుకాణాలను మాత్రం వెంటనే తీసివేశారని ఆరోపించారు. కానీ వైసీపీ నేతలుకున్న దుకాణాలు తీసేందుకు అధికారులు సైతం భయపడుతున్నారని మండిపడ్డారు.
అక్రమ దుకాణాలు తొలగించాలి...
తిరుమలతో పాటు తిరుపతిలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన అక్రమ దుకాణాలు కొనసాగుతున్నాయన్నారు. తిరుమల క్షేత్రానికి వెళ్లే దారిలో అడ్డంగా దుకాణాలు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా తిరుమల క్షేత్రం ఎదురుగా ఉన్న దుఖాణాలను మాత్రం తొలగించడం లేవన్నారు. మొత్తం 15 దుకాణాలకు అనుమతి లేదని, వాటిని తీసివేందుకు అధికారులు భయపడుతున్నారని స్పష్టం చేశారు. తిరుమలలో ఉన్న అక్రమ దుకాణాలను 24 గంటల్లో తొలగించాలని, లేని పక్షంలో మహా ఉద్యమానికి పిలుపునిస్తామని తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్ హెచ్చరించారు. భూమన కరుణాకరన్ రెడ్డి క్రిస్టియన్ అని ప్రశ్న రావణ్ తెలిపారని గుర్తు చేశారు. కరుణాకర్ రెడ్డి, ప్రశ్న రావణ్ కు ఉన్న సంబంధమేంటో ఏపీ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు బయటపెట్టాలని ఓంకార్ డిమాండ్ చేశారు.






