బొగతకు పర్యాటకుల తాకిడి

by Ratna Kumari |

వర్షాలతో బొగత జలపాతం కొత్త అందాలు సంతరించుకోగా, ఆదివారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందడి చేశారు.

బొగతకు పర్యాటకుల తాకిడి
X

దిశ, వెంకటాపురం (నూగూరు) : ఇటీవల కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతంలోకి కొత్త నీరు చేరడంతో జలపాతం మరింత సుందరంగా మారింది. వారాంతపు సెలవు కావడంతో ఆదివారం బొగత జలపాతాన్ని సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ జలపాతం అందాలను తమ కెమెరాల్లో బంధించుకుంటూ సందడి చేశారు. వర్షాకాలంలో బొగత జలపాతం మరింత ఆకర్షణీయంగా మారడంతో సందర్శకుల రద్దీ పెరుగుతోంది. అయితే వాజేడు, వెంకటాపురం మండలాల్లోని ఇతర జలపాతాలను అధికారులు నిషేధిత ప్రాంతాలుగా ప్రకటించినందున, ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా పర్యాటకులు స్థానిక సిబ్బంది సూచనలను పాటించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

Next Story