రేషన్ బియ్యం పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు

by Kodari Anjali |

సిరిపూర్ టి మండలం ఆదివారం రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహసీల్దార్ రాజ్ కుమార్ తెలిపారు.

రేషన్ బియ్యం పట్టివేత.. నలుగురిపై కేసు నమోదు
X

దిశ, బెజ్జూర్: సిరిపూర్ టి మండలం ఆదివారం రేషన్ బియ్యం పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహసీల్దార్ రాజ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పిడిఎఫ్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బియ్యంతో పాటు ఆటో రెండు మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Next Story