- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమకు రూ.70 లక్షల కట్నం అడ్డుగోడ..!
రెండేళ్ల ప్రేమ తర్వాత రూ.70 లక్షల కట్నం కోసం పెళ్లికి నిరాకరించాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట నిరసన చేపట్టింది.

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో ఓ ప్రేమ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశమైంది. అన్నారం పెద్దతండాకు చెందిన భూక్యా అంజలి అనే యువతి, తనతో రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న యువకుడు పెళ్లి మాట వచ్చిన తర్వాత కట్నం కారణంగా తనను నిరాకరించాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట మౌన నిరసనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో జిమ్నాస్టిక్ ట్రైనర్‌గా పనిచేస్తున్న సమయంలో ముస్మి గ్రామానికి చెందిన, ప్రస్తుతం నేవీలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న యువకుడితో బస్సు ప్రయాణంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి రెండేళ్లుగా ఇద్దరూ సన్నిహితంగా ఉన్నట్లు తెలిపింది.
అయితే పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే యువకుడి వైఖరిలో మార్పు వచ్చిందని, మరో సంబంధం ద్వారా రూ.70 లక్షల కట్నం వస్తోందని చెప్పి తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు యువతి ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేస్తూ ప్రియుడి ఇంటి ఎదుట మౌన పోరాటం కొనసాగిస్తోంది. ఈ ఘటనతో "ప్రేమించినప్పుడు కనిపించని కట్నం.. పెళ్లి మాట వచ్చినప్పుడు అడ్డుగోడగా మారిందా..?" అనే చర్చ స్థానికంగా సాగుతోంది. కాగా, ఈ ఆరోపణలపై సంబంధిత యువకుడి స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది.






