- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిలింనగర్‌లో ఫెరారీ కారు బీభత్సం.. అపార్ట్‌మెంట్ గేటును ఢీకొట్టి ధ్వంసం
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున స్పోర్ట్స్ కారు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, ఖైరతాబాద్ :హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఆదివారం తెల్లవారుజామున స్పోర్ట్స్ కారు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న ఫెరారీ కారు అదుపుతప్పి హిల్ వ్యూ అపార్ట్‌మెంట్ ప్రధాన గేటును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు అపార్ట్‌మెంట్ గేటుతో పాటు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం సమయంలో రోడ్డుపై పెద్దగా రద్దీ లేకపోవడంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటన మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల జరిగిందా, లేక అతివేగమే ప్రమాదానికి కారణమా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తూ కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.






