ముగిసిన షాబాద్ సైకో కిల్లర్ కథ.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ మృతి?

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-12 09:35:36  IST  )

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన షాబాద్ ఆరుగురి హత్యల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

ముగిసిన షాబాద్ సైకో కిల్లర్ కథ.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రాజ్‌కుమార్ మృతి?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన షాబాద్ ఆరుగురి హత్యల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ దారుణ మారణహోమానికి ఒడిగట్టి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ పోలీసుల ఎన్ కౌంటర్‌లో మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మల్కారం గ్రామం సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినప్పటికీ నిందితుడు ఎదురుదాడికి దిగడం లేదా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఈ కాల్పులు జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. గత శుక్రవారం అర్ధరాత్రి వేళ తన భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన రాజకుమార్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో మల్కారం పరిసర ప్రాంతాల్లో నిందితుడు నక్కి ఉన్నాడనే పక్కా సమాచారంతో పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. నిందితుడిని చుట్టుముట్టి పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో జరిగిన కాల్పుల్లో రాజ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

Next Story