- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున యాదవ్‌కు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు...

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్(YCP Official Spokesperson Nagarjuna Yadav)ను తెలంగాణ పోలీసులు(Telangana Police) అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున యాదవ్‌కు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గుంటూరులో ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు అడగడంతో తెలంగాణ పోలీసులమని చెప్పారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇస్తామని సైతం చెప్పినట్లు సమాచారం.
లైవ్ డిబేట్‌లో సీఎంపై విమర్శలు
కాగా ఓ చానల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో నాగార్జున యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి జొమాటో డెలివరీ బాయ్ అని సంబోధించడమే కాకుండా ప్రభుత్వ జీవోలు కూడా సరిగా చదవడం కూడారాదని విమర్శించారు. ఎమ్మెల్యేగా కూడా రేవంత్ రెడ్డి పనికారాడంటూ డిబేట్‌లో నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులోనే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






