ఓటరు సవరణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి : కలెక్టర్

by Batti.Sumithra |

సర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు సవరణ కార్యక్రమాన్ని బీఎల్ఓలు రాజకీయ పార్టీల నాయకుల సమన్వయంతో విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

ఓటరు సవరణ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలి : కలెక్టర్
X

దిశ, వలిగొండ : సర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఓటరు సవరణ కార్యక్రమాన్ని బీఎల్ఓలు రాజకీయ పార్టీల నాయకుల సమన్వయంతో విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. ఆదివారం మండలంలోని నాగారం గ్రామంలో నిర్వహిస్తున్న ఓటరు సవరణ కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి బీఎల్ఓలతో మాట్లాడుతూ ఓటరు సవరణ ఏ విధంగా నిర్వహిస్తున్నారు. మృతి చెందిన వారి పేర్లను ఏ విధంగా తొలగిస్తున్నారు, కోడళ్ళ ఓటరు నమోదు ఏ విధంగా చేస్తున్నారు అని ఆరా తీశారు. అనంతరం వారికి తగు సూచనలు సలహాలు చేశారు. ముందుగా వలిగొండ మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా రిజిస్టర్స్ ను స్టాక్ ను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరఫరా చేయాలని లేనియెడల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దశరథ, ఆర్ఐ కరుణాకర్ రెడ్డి, ఎంఏఓ అంజనీ దేవి, ఏఈఓలు, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, బీఎల్వోలు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story