- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ పాత్ర నా రియల్ లైఫ్‌కి చాలా దగ్గరగా ఉంటుంది: రాషా తడాని
తనకు ఈ కథలోని లవ్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా నచ్చాయని, కథ వింటున్నప్పుడే ఆ ఎమోషన్‌కు తాను బాగా కనెక్ట్ అయ్యానని రాషా చెప్పారు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ‘శ్రీనివాస మంగాపురం’టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. కిరణ్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. జయకృష్ణ సరసన బాలీవుడ్ స్టార్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఈ మూవీ జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, తాజాగా చిత్రయూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ రాషా తడాని సినిమా గురించి, తన పాత్ర గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తనకు ఈ కథలోని లవ్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా నచ్చాయని, కథ వింటున్నప్పుడే ఆ ఎమోషన్‌కు తాను బాగా కనెక్ట్ అయ్యానని రాషా చెప్పారు. ఇదొక వండర్‌ఫుల్ స్టోరీ అని అన్నారు. ఈ సినిమాలో తాను మంగ అనే పాత్రలో కనిపిస్తానని, ఇందులో రెండు విభిన్నమైన కోణాలు ఉంటాయని వెల్లడించారు. ఒకవైపు ఎంతో తుంటరిగా, మరోవైపు చాలా పద్ధతిగా, హుందాగా తన పాత్ర కనిపిస్తుందని చెప్పారు.
తనకు తెలుగు స్పష్టంగా మాట్లాడటం రాకపోయినప్పటికీ, ఎదుటివారు చెబితే బాగా అర్థమవుతుందని అన్నారు. అందుకే దర్శకుడు అజయ్ భూపతి తనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రతి డైలాగ్, ఎమోషన్‌ను దగ్గరుండి నేర్పించారని గుర్తుచేసుకున్నారు. ఈ మంగ పాత్ర తన రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉంటుందని ఆమె తెలిపారు. తన మొదటి తెలుగు సినిమా షూటింగ్ తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో జరగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమా కోసం తనతో పాటు టీమ్ మొత్తం రాత్రింబవళ్లు చాలా కష్టపడ్డారని వెల్లడించారు. ఇక నిర్మాతల గురించి మాట్లాడుతూ.. అశ్విని దత్ గారు తన జీవితంలో కలిసిన బెస్ట్ పర్సన్స్‌లో ఒకరని రాషా ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఆయన తనను సొంత మనవరాలిలా చూసుకున్నారని చెప్పారు. తన తాతగారితో అశ్విని దత్ గారికి మంచి పరిచయం ఉందని, అంత పెద్ద బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ ఆయన ఎంతో వినయంగా, డౌన్ టు ఎర్త్ ఉంటారని ప్రశంసించారు. అలాగే సెట్స్‌లో సీనియర్ నటుడు మోహన్ బాబు గారికి ఉన్న అనుభవం నుంచి తాను ఎన్నో నటనకు సంబంధించిన విషయాలను నేర్చుకున్నట్లు రాషా తడాని చెప్పుకొచ్చారు






