- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సందీప్ రెడ్డి వంగా డెడికేషన్‌కు ఫిదా అయిన పృథ్వీరాజ్.. 'యానిమల్' సీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
'యానిమల్' సినిమాలో ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్‌గా రావాలనే లక్ష్యంతో సందీప్ ఒకే సీన్‌ను చాలా సార్లు చేయించారని పృథ్వీరాజ్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: సీనియర్ టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వడ్డే నవీన్ హీరోగా తెరకెక్కిన 'పెళ్లి' చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అనంతరం హీరోగా, విలన్‌గా, కీలక పాత్రల్లో నటిస్తూ ఎన్నో సంవత్సరాలు విజయవంతమైన కెరీర్‌ను కొనసాగించారు. అయితే కొంతకాలం పాటు ఆయనకు ఆశించిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదు. అలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు.
ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు పృథ్వీరాజ్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రం తర్వాత ఆయనకు వరుసగా పలు సినిమాల్లో అవకాశాలు లభించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'యానిమల్' సినిమా సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డెడికేషన్ గురించి పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అత్యుత్తమ దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. సినిమా తెరకెక్కించే విషయంలో ఆయన ఎంతో నిబద్ధతతో, అత్యంత శ్రద్ధతో పనిచేస్తారు.
'యానిమల్' సినిమాను నాలుగు, ఐదు సార్లు చుస్తే తప్ప ప్రతి సన్నివేశంలో లోతు పూర్తిగా అర్థం కాదు. సినిమాలో నాపై బార్‌లో వచ్చే ఒక సన్నివేశంలో స్టూల్‌పై సాధారణంగా కూర్చోకుండా ఎగిరి దూకి కూర్చోవాలని సందీప్ చెప్పారు. నేను మొదటి టేక్ బాగానే చేశానని అనుకున్నా, ఆయన అదే సన్నివేశాన్ని నాలుగు, ఐదు సార్లు మళ్లీ చేయించారు. 'ఎందుకు ఇన్ని టేకులు?' అని అడిగితే, 'మీ యాక్టింగ్ ఇంకాస్త చూడాలని ఉంది' అని సరదాగా చెప్పారు. అయితే, ఆయన ఉద్దేశం ప్రతి సన్నివేశం పర్ఫెక్ట్‌గా రావడమే. ఇప్పటికే బాగా వచ్చిన సీన్‌ను కూడా మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారని పృథ్వీరాజ్ తెలిపారు.






