బెంగళూరులో దారుణం.. ఇంట్లోకి చొరబడి డెలివరీ బాయ్ వికృత చేష్ట‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-12 06:05:21  IST  )

బెంగ‌ళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ డెలివ‌రీ బాయ్ ఒంట‌రి యువ‌తి ఇంటికి వ‌చ్చి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ పార్సిల్ ఇచ్చేందుకు ఇంటికి వ‌చ్చిన డెలివ‌రీ బాయ్ అర్జెంట్ గా టాయిలెట్ వెళ్లి వ‌స్తానంటూ రిక్వెస్ట్ చేశాడు.

బెంగళూరులో దారుణం.. ఇంట్లోకి చొరబడి డెలివరీ బాయ్ వికృత చేష్ట‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: బెంగ‌ళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ డెలివ‌రీ బాయ్ ఒంట‌రి యువ‌తి ఇంటికి వ‌చ్చి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ పార్సిల్ ఇచ్చేందుకు ఇంటికి వ‌చ్చిన డెలివ‌రీ బాయ్ అర్జెంట్ గా టాయిలెట్ వెళ్లి వ‌స్తానంటూ రిక్వెస్ట్ చేశాడు. కానీ యువ‌తి తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నానని వెళ్ల‌డానికి వీలు లేద‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ విన‌కుండా బ‌లవంతంగా యువ‌తి ఇంట్లోకి ప్ర‌వేశించాడు. అక్క‌డితో ఆగ‌కుండా యువ‌తికి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డ్డాడు. భయాందోళ‌న‌కు గురైన యువ‌తి అత‌డిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. యువతి ప్ర‌శ్నిస్తూ వీడియో తీస్తుంటే అత‌డు ఇంట్లో నుండి పారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. నా గురించి ఏం అనుకుంటున్నావ్.. పోలీసుల‌కు ఫోన్ చేస్తా ఆగు అంటూ యువ‌తి అరుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అత‌డిని తాను వ‌దిలిపెట్ట‌న‌ని క‌చ్చితంగా పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాన‌ని చెప్పింది. ఇలాంటి వాళ్ల‌ను ప‌నిలో పెట్టుకునేముందు కంపెనీలు బ్యాగ్రౌండ్ వెరిఫికేష‌న్ చేసుకోవా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో పోలీసులు అత‌డిని క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Next Story