శర్వానంద్ 'జార్జ్ క్రిష్'లో రవీనా టాండన్?

by Pulgam srinivas |

శర్వానంద్–శ్రీనువైట్ల చిత్రంలో సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

శర్వానంద్ జార్జ్ క్రిష్లో రవీనా టాండన్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం దర్శకుడు శ్రీనువైట్లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తైనట్లు సమాచారం. రెండో షెడ్యూల్‌ను ఆగస్టు నెల నుంచి ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు జార్జ్ క్రిష్ అనే టైటిల్ను ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించే అవకాశమున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో సీనియర్ స్టార్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఆమె పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రవీనా టాండన్ వంటి క్రేజ్ ఉన్న నటి ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో శర్వానంద్ విజయాన్ని అందుకున్నాడు. మరి వచ్చే సంక్రాంతికి కూడా తన కొత్త చిత్రంతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Next Story