పోచారం రాజీవ్ సద్భావన టౌన్‌షిప్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!

by Jakkula.Mamatha |

పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ సద్భావన టౌన్షిప్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాట్ పై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోచారం రాజీవ్ సద్భావన టౌన్‌షిప్‌లో వ్యభిచారం గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!
X

దిశ, ఘట్కేసర్: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ సద్భావన టౌన్షిప్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఫ్లాట్ పై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్ సద్భావన టౌన్షిప్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఓ ఫ్లాట్ పై శనివారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఫ్లాట్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి, ఘటనకు సంబంధించిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని, అక్కడే ఉన్న ఒక మహిళను రక్షించారు.

తనిఖీలలో భాగంగా పలు మొబైల్ ఫోన్లు, ఉపయోగించిన, ఉపయోగించని కండోమ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా రాజీవ్ సద్భావన ఫ్లాట్లో తనిఖీ, స్వాధీనం ప్రక్రియ మొత్తం టౌన్షిప్ వాసుల సమక్షంలో ఈ-సాక్ష్య యాప్ ద్వారా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచారం, మానవ అక్రమ రవాణా లేదా ఇతర అనైతిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు ఫోన్ చేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు సూచించారు.

Next Story