- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ హీరో ఆర్య పై చీటింగ్ కేసు నమోదు
తమిళ ప్రముఖ నటుడు శంషాద్ సీ (ఆర్య)తో పాటు 'మినీ స్టూడియో', 'ది షో పీపుల్' నిర్మాణ సంస్థలపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది.

దిశ, జూబ్లీహిల్స్: తమిళ ప్రముఖ నటుడు శంషాద్ సీ (ఆర్య)తో పాటు 'మినీ స్టూడియో', 'ది షో పీపుల్' నిర్మాణ సంస్థలపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. రూ.1.80 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా మోసం చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. సదరు సంస్థలు శంషాద్ సీ(ఆర్య) అనే హీరోతో ‘అనంతన్ కాడు’ అనే సినిమా తీసేందుకు గాను రూ.2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్ పరికరాలు తాహెర్ సినీ టెక్నిక్ సంస్థ వద్ద తీసుకున్నాయి. రూ.42 లక్షలు మాత్రమే చెల్లించి, రూ.1.80 కోట్ల బాకీ సొమ్ము, జీఎస్టీ బకాయిలను క్లియర్ చేయకుండా మోసగించారని తాహెర్ సినీ టెక్నిక్ అకౌంట్స్ హెడ్ సయ్యద్ జావిద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం వెళ్ళిన తమ మేనేజర్‌ను వారు బెదిరించారని పేర్కొన్నారు. సయ్యద్ జావీద్ అలీ ఫిర్యాదు మేరకు హీరో ఆర్య, ప్రొడ్యూసర్ వినోద్, చిత్రబృందం పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






