కీడు సోకిందని ఊరు ఖాళీ చేసిన జమ్మికుంట ప్రజలు.. రోజంతా బయటే!

by Jakkula.Mamatha |

జమ్మికుంట పట్టణంలోని 13, 14వ వార్డు ఆబాది జమ్మికుంట గ్రామంలో ఊరికి కీడు సోకిందనే నమ్మకంతో గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా "గ్రామం ఖాళీ" చేశారు.

కీడు సోకిందని ఊరు ఖాళీ చేసిన జమ్మికుంట ప్రజలు.. రోజంతా బయటే!
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని 13, 14వ వార్డు ఆబాది జమ్మికుంట గ్రామంలో ఊరికి కీడు సోకిందనే నమ్మకంతో గ్రామస్తులు సాంప్రదాయబద్ధంగా "గ్రామం ఖాళీ" చేశారు. గత కొంత కాలంగా గ్రామంలో పలువురు మరణించడంతో ఊరికి కీడు సోకిందని గ్రామ పెద్దలు భావించారు. దీంతో గ్రామంలోని పెద్ద మనుషుల సమక్షంలో సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ ప్రజలందరూ ఊరు వదిలిపెట్టి గ్రామ శివారులో బయట వంటలు చేసుకోవాలని తీర్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఊరికి అపశకునం, కీడు సోకిందని భావించినప్పుడు ఇలా ఊరు బయట వంటలు చేసుకుని, ప్రత్యేక పూజలు చేయడం పాతకాలపు ఆచారం. "ఊరు శుద్ధి" కోసం ఇలా చేయడం వల్ల కీడు తొలగిపోతుందని స్థానికుల నమ్మకం. గతంలో కూడా బయటికి వంటలకు వెళ్ళామని గ్రామస్తులు తెలిపారు.

Next Story