- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా హక్కులు కాలరాస్తే తిరగబడతా.. మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తన హక్కులు కాలరాస్తే తిరగబడతానని హెచ్చరించారు. ఇటీవల తుంగతుర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు నేడు మధ్యాహ్నం సామేల్ జగ్గారెడ్డి ముందు హాజరుకానున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా తన హక్కులు కాలరాస్తే తిరగబడతానని హెచ్చరించారు. ఇటీవల తుంగతుర్తి కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు నేడు మధ్యాహ్నం సామేల్ జగ్గారెడ్డి ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుండి వచ్చినవాళ్లకు పదవులు ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లకు ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కష్టపడ్డవాళ్లకే టికెట్లు ఇచ్చామని చెప్పారు.
ఇప్పుడు ఉన్న తొమ్మిది మంది పదవులను ఎవరూ కదిలించలేరు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ చామల లెటర్ రాయడం వల్లనే ఈ పంచాయితీ మొదలైందని చెప్పారు. తనకు చామలకు ఎలాంటి గొడవలు లేవని, తాము జోకులు కూడా చేసుకుంటామని తెలిపాడు. చామలకు అసలు తుంగతుర్తి గురించి తెలియదని, ఎన్నికల సమయంలో తనకు సపోర్ట్ చేయడంతో ఆయన ఎంపీ అవ్వాలని తాను కోరుకున్నట్టు తెలిపారు. చామల కొంతమంది మాటలు విని ఇలా చేస్తున్నారని అనిపిస్తుందన్నారు.
కొందరు ఇది తమ సంస్థానం అని అనుకుంటున్నారని అలా అనుకుంటే కష్టం అని చెప్పారు. జగ్గారెడ్డితో మాట్లాడిన తరవాత అవసరం అయితే మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డిలను సైతం కలుస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే మండల కమిటీల ఎన్నికల విషయంలో తుంగతుర్తి కాంగ్రెస్ లో గ్రూప్ వార్ మొదలైంది. ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేల్ వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డికి సూచించింది. ఈ నేపథ్యంలనే నేడు గాంధీభవన్ లో సామేల్ జగ్గారెడ్డితో భేటీ కానున్నారు. భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.






