- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. దినసరికూలీలు మృతి
by Naga Rani Yarlagadda |
తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను దేవరపల్లి గ్రామానికి చెందిన శ్రీను (39), కడలి రాజేంద్ర (32)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న దేవరపల్లి పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టమ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Next Story






