- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.573 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం.. పైలాన్‌ను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో భాగంగా మక్తల్ వేదికగా రూ.573.28 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 18 రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది.

దిశ, మక్తల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధిలో భాగంగా మక్తల్ వేదికగా రూ.573.28 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 18 రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ పైలాన్‌ను ఆదివారం ఉదయం మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు హాజరై రోడ్డు నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించనున్నారు. మక్తల్ – నారాయణపేట ఫోర్ లేన్ రోడ్డు: రూ.237 కోట్లు (26 కి.మీ.), మరికల్ – మినాస్‌పూర్ – లింగంపల్లి రోడ్డుకు రూ.49.57 కోట్లు, ఆత్మకూరు – మరికల్ రోడ్డుకు రూ.22.47 కోట్లు, నల్లగట్టు – హిందూపూర్ రోడ్డు (మాగనూరు మండలం)కు రూ.10.49 కోట్లు మరికొన్ని రహదారులకు ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (HAM) కింద నిధులు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పనుల విశేషాలను వెల్లడించారు మక్తల్ - నారాయణపేట మధ్య 26 కిలోమీటర్ల మేర నిర్మించే ఫోర్ లేన్ రోడ్డును త్రీ-లేయర్ డెవలప్‌మెంట్‌తో, రోడ్డు మధ్యలో గ్రీన్ ప్లాంటేషన్‌తో అత్యంత నాణ్యతగా నిర్మించనున్నారు. నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కంపెనీయే రాబోయే 15 సంవత్సరాల పాటు ఈ రోడ్డు నిర్వహణ (Maintenance) బాధ్యతలను చూసుకుంటుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత 20 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా రూ.237 కోట్ల నిధులు మంజూరు చేయించానని తెలిపారు. "టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని" విపక్షాలు చేసిన విమర్శలకు సోమవారం ముగ్గురు మంత్రుల చేతుల మీదుగా పనులు ప్రారంభించి తగిన సమాధానం ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.






