రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Ratna Kumari |

జమ్మికుంట-బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు.

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, జమ్మికుంట : జమ్మికుంట-బిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం సుమారు 60-65 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతదేహాన్ని గుర్తింపు కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

Next Story