- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేయాలి: బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలను కప్పిపుచ్చేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు....

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నిజాలను కప్పిపుచ్చేందుకు, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగిందని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదానికి కారణమైన వ్యక్తిని రక్షించేందుకు అమాయక యువకుడిని కేసులో ఇరికించారని విమర్శించారు. ప్రమాదానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరవ్ కారణమయ్యాడని, దీనికి సీసీటీవీ దృశ్యాలు ఆధారాలుగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. అయితే నిందితుడిని తప్పించేందుకు సిద్ధార్థ్ అనే బ్రాహ్మణ యువకుడిని బలిపశువుగా మార్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించాల్సిన బాధ్యతను నిర్వర్తించకుండా, నిందితుడిని తప్పించడానికే ప్రాధాన్యం ఇచ్చారని బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. ప్రమాదం అనంతరం తొలి 20 నిమిషాల "గోల్డెన్ పీరియడ్"లో చికిత్స అందితే ప్రాణాలు దక్కే అవకాశం ఉండేదన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, ప్రమాదానికి బాధ్యులైన వారితో పాటు నిందితులను తప్పించేందుకు ప్రయత్నించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






