ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్‌

by velandi.Saikiran |   (  Updated:2026-07-14 21:31:10  IST  )

సెమీస్ లో ఫ్రాన్స్ పై విజ‌యం సాధించి, ఫైన‌ల్స్ కు దూసుకెళ్లింది స్పెయిన్.

ఫైనల్‌కు దూసుకెళ్లిన స్పెయిన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా తొలి సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తలపడ్డాయి. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన స్పెయిన్.. ఫ్రాన్స్ ను ఇంటికి పంపించింది. ఈ మ్యాచ్ లో 0-2 తేడాతో విజయం సాధించిన స్పెయిన్, ఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది. దీంతో సోషల్ మీడియాలో స్పెయిన్ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇక అర్జెంటీనా, ఇంగ్లాండ్ మధ్య రేపు రెండో సెమీ ఫైనల్ ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు స్పెయిన్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

మెగా ఫైనల్ ఎప్పుడు అంటే ?

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జూలై 19వ తేదీన జరగనుంది. వచ్చే ఆదివారం న్యూ జెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియం వేదికగా స్పెయిన్ తో ఇంగ్లాండ్ లేదా అర్జెంటీనా ఫైనల్స్ లో టైటిల్ కోసం తలపడతాయి.

Next Story