'తల్లికి వందనం' పై మరో అప్డేట్... ఆ రోజునే నిధులు విడుదల!

by velandi.Saikiran |

తల్లికి వందనం నిధుల (Thalliki Vandanam Scheme) విడుదలపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

తల్లికి వందనం పై మరో అప్డేట్... ఆ రోజునే నిధులు విడుదల!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. తల్లికి వందనం నిధుల (Thalliki Vandanam Scheme) విడుదలపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. స్కూళ్లలో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరగనున్నాయి. ఆ కార్యక్రమం నిర్వహించే లోపే తల్లికి వందనం స్కీం కింద విద్యార్థికి డబ్బులు ఖాతాలో జమ చేసేందుకు సర్కార్ కసరత్తులు ప్రారంభించింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం..జూలై 16,17, 18 తేదీలలో డ‌బ్బులు రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి తొలి విడతలో రూ.10,049 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు కూడా నేడు వచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కొత్తగా బడుల్లో చేరే వారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఒక్క విద్యార్థికి రూ.13 వేల చొప్పున జమ అవుతాయి. మ‌రో రూ.2 వేలు పాఠ‌శాల నిర్వ‌హ‌ణ కోసం వాడుకోనున్నారు.

Next Story