షాకింగ్.. రాజ్‌కుమార్‌ హిట్‌లిస్ట్‌లో మరో నలుగురు

by Ajay Maddhiboyina |

షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ హిట్ లిస్టులో మరో నలుగురు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మైనర్ బాలికను వేధించినందుకు రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసిన బాలిక మేనమామ రాజు, బాలిక బాబాయ్ చిట్యాల శ్రీనివాస్ ఆయన సతీమణి, నరేష్ అనే వ్యక్తి సహకరించారని హత్యలకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో చెప్పాడు.

షాకింగ్.. రాజ్‌కుమార్‌ హిట్‌లిస్ట్‌లో మరో నలుగురు
X

దిశ, వెబ్ డెస్క్: షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ హిట్ లిస్టులో మరో నలుగురు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మైనర్ బాలికను వేధించినందుకు రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసిన బాలిక మేనమామ రాజు, బాలిక బాబాయ్ చిట్యాల శ్రీనివాస్ ఆయన సతీమణి, నరేష్ అనే వ్యక్తి సహకరించారని హత్యలకు ముందు రికార్డ్ చేసిన వీడియోలో చెప్పాడు. దీంతో ఆరుగురిని హతమార్చిన రాజ్ కుమార్ ఆ నలుగురిని సైతం చంపేయాలని నిర్ణయించుకున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో వారు అక్కడ లేకపోవడం వల్లనే తప్పించుకున్నారని గ్రామస్థులు సైతం చర్చించుకుంటున్నారు.

ఇక రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో, హత్యలకు ముందు రాసిన స్టాంప్ పేపర్లపై బాలిక, ఆమె కుటుంబంపై ఆరోపణలు చేసినప్పటికీ అతడు చేసిన దారుణాన్ని మాత్రం ఎవరూ సమర్దించడంలేదు. మైనర్ బాలికతో సంబంధం పెట్టుకోవడమే నేరమైతే, అంతకు ముందే రాజ్ కుమార్ కు మరికొందరు మహిళలతోనూ సంబంధాలు ఉన్నాయని రాజ్ కుమార్ అత్త మీడియాకు వెళ్లడించారు. అంతే కాకుండా బెట్టింగ్ యాప్స్ లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు తాగడం లాంటి వ్యసనాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు రాజ్ కుమార్ తన కన్నబిడ్డలు అది కూాడా మూడు, ఐదు సంవత్సరాల పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది. దీంతో రాజ్ కుమార్ హత్యాకాండ తెలుగు రాష్ట్రాల్లోనే ఒక సంచలన కేసుగా మారిపోయింది.

Next Story