ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్

by Muthe.Rajitha |

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని ప్రసిద్ధ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుండి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.

ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముంబైలోని ప్రసిద్ధ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుండి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. గత కొంతకాలంగా భుజాల నొప్పితో బాధపడుతున్న ఆయన, తన రెండు భుజాలకు శస్త్రచికిత్స (Surgery) చేయించుకోవడం కోసం ఈనెల 10వ తేదీన ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలోనే 4 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న ఆయన, కోలుకోవడంతో వైద్యులు బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. అయితే, ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మరికొన్ని రోజుల పాటు ఆయనకు పూర్తి బెడ్ రెస్ట్ అవసరమని వైద్య బృందం సూచించినట్లు సమాచారం.

కాగా పవన్ కళ్యాణ్ భుజాల సర్జరీ అనంతరం కోలుకుని, మళ్లీ మునుపటి ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి, ప్రజల మధ్యలోకి తిరిగి వస్తారు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారనే వార్తతో జనసేన శ్రేణులు, కూటమి నాయకులు, ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా 'వెల్ కమ్ బ్యాక్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story