- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెబ్బెన మండలం నారాయణపూర్‌లో హత్యకు గురైన వ్యక్తి..
by Kodari Anjali |
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.

X
దిశ, రెబ్బెన: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతుడిని వేమునూరి స్వామిగా గుర్తించినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెబ్బెన ఎస్‌ఐ, సీఐ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరు అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






