- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పుల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

దిశ, వెబ్ డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పుల నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు ఈరోజు కొద్దిపాటి లాభాలను నమోదు చేశాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పెరిగి రూ.1,43,570 కి చేరింది. అదేవిధంగా, ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.700 వృద్ధి చెంది రూ.1,31,600 వద్ద పలుకుతోంది. బంగారంతో పోలిస్తే పారిశ్రామిక డిమాండ్ నెమ్మదించడంతో వెండి ధరలలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,35,000 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఆధారంగానే ఈ ధరల పెరుగుదల నమోదైనట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక జ్యువెలరీ వ్యాపారుల సమాచారం ప్రకారం.. ధరలు సరికొత్త గరిష్ఠాల వద్ద కొనసాగుతుండటంతో వినియోగదారులు కొనుగోళ్ల విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.






