పంచాయితీ నిధులు‘గోల్‌మాల్’..?

by Kodari Anjali |

పంచాయతీ పెద్దలు రూ.15 లక్షలు నొక్కేశారని గ్రామస్తులు కలెక్టర్‌ను ఆశ్రయించారు.

పంచాయితీ నిధులు‘గోల్‌మాల్’..?
X

దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధి తెల్లబండ తండా గ్రామపంచాయతీలో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు కలెక్టర్ స్నేహ శబరీష్,లోకల్ బాడీ అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా, నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.15,00,000 లక్షలు దుర్వినియోగం జరిగాయని సర్పంచ్, ఉప సర్పంచ్,పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీపీ బాలు నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ పరిధిలో ఎలాంటి రికార్డులను నిర్వహించకుండా ప్రజాధనాన్ని దారి మళ్లించారని ఆరోపించారు. ముఖ్యంగా గ్రామ పారిశుధ్యం, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, నీటి మోటార్ల మరమ్మతులు, పంచాయతీ ట్రాక్టర్ నిర్వహణ పేరిట నిధులను కాజేశారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పనులు సున్నా అని,కానీ కాగితాల్లో మాత్రం లక్షల రూపాయల బిల్లులు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాల ఫిర్యాదు పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

Next Story