చాలామంది వద్దన్నా వినలేదు.. ఆ పాత్ర వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కృష్ణవంశీ

by Pulgam srinivas |

'రంగ మార్తాండ'లో బ్రహ్మానందంకు సీరియస్ పాత్ర ఇవ్వొద్దని చాలామంది చెప్పినా, తాను వారి మాట వినలేదని కృష్ణవంశీ తెలిపారు.

చాలామంది వద్దన్నా వినలేదు.. ఆ పాత్ర వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన కృష్ణవంశీ
X

దిశ, వెబ్ డెస్క్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని నటుడు బ్రహ్మానందం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణవంశీ మాట్లాడుతూ, "బ్రహ్మానందం గొప్ప నటుడు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో కోట్లాది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే ఆయనకి ఎక్కువగా సీరియస్ పాత్రల్లో నటించే అవకాశం రాలేదు. 'రంగ మార్తాండ' చిత్రంలో బ్రహ్మానందం కోసం నేను ఓ సీరియస్ పాత్రను అనుకున్నాను. అప్పట్లో చాలామంది 'అంత సీరియస్ పాత్ర బ్రహ్మానందంకు సెట్ కాదని, దానివల్ల సినిమా స్థాయి కూడా దెబ్బతినే అవకాశం ఉందని' చెప్పారు.

కానీ నేను వారి మాటలను పట్టించుకోలేదు. బ్రహ్మానందం గారు కేవలం కామెడీతో నవ్వించడమే కాదు, సీరియస్ సన్నివేశాల్లో ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసి కన్నీళ్లు కూడా తెప్పించగలరనే నమ్మకం నాకు బలంగా ఉంది. అందుకే ఎవరు ఏమన్నా వినకుండా 'రంగ మార్తాండ'లో ఆ పాత్రకు ఆయననే ఎంపిక చేశాను. ఆ సినిమాలో బ్రహ్మానందం తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తన కామెడీతో పాటు భావోద్వేగభరితమైన పాత్రలను కూడా అద్భుతంగా పోషించగలనని ఆయన నిరూపించుకున్నారు" అని కృష్ణవంశీ తెలిపారు.

Next Story