- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాధారణ మహిళే అనుకుని వేధించాడు.. ఆమె ఎవరో తెలిసి వణికిపోయాడు
పశ్చిమ బెంగాల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఖర్దాలో ఓ డెలివరీ ఏజెంట్ రోడ్డుపై నిలుచుకున్న మహిళను చూస్తూ అసభ్య చేష్టలు చేస్తూ సైగలు చేసి పైశాచిక ఆనందం పొందాడు. కొద్దిసేపు అతడినే గమనించిన మహిళ కోపంతో రగిలిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఖర్దాలో ఓ డెలివరీ ఏజెంట్ రోడ్డుపై నిలుచుకున్న మహిళను చూస్తూ అసభ్య చేష్టలు చేస్తూ సైగలు చేసి పైశాచిక ఆనందం పొందాడు. కొద్దిసేపు అతడినే గమనించిన మహిళ కోపంతో రగిలిపోయింది. అయితే ఆమె సాధారణ మహిళే అనుకుని డెలివరీ బాయ్ వేధింపులకు పాల్పడ్డాడు. కానీ చివరికి ఆమె ఆఫ్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ అని తెలిసి షాక్ అయ్యాడు. ఆ మహిళా కానిస్టేబుల్ యువకుడి వద్దకు నేరుగా వెళ్లి మహిళలు కనిపిస్తే వేధింపులకు పాల్పడటమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాను పోలీస్ చెప్పడంతో యువకుడు తప్పైందని విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వినకుండా నడిరోడ్డుపై అతడి కాలర్ పట్టుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకుని వెళ్లింది. మహిళ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖర్దా పోలీసులు ఆకతాయిపై కేసు నమోదు చేశారు. ఆమె ధైర్య సాహసాలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళల జోలికి వస్తే ఇలాగే ఉంటుందంటూ ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






