- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిలావర్పూర్‌లో దొంగల హల్ చల్.. మాస్క్ ధరించి రెండు ఇండ్లలో చోరీ
by Kodari Anjali |
దిలావర్పూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు రెండు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు.

X
దిశ, దిలావర్పూర్: దిలావర్పూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి దొంగలు రెండు ఇండ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. గౌరీ పోశెట్టి ఇంట్లో 40 వేల రూపాయల నగదు, తులం బంగారం అపహరించగా సమీప నివాసంగా ఉన్న గారడి ముత్యం ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. దొంగలు సినీ పక్కిలో మాస్కులు ధరించి సంచరిస్తున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న దిలావర్పూర్ ఎస్సై రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కూలి పనిచేసి జమ చేసుకున్న డబ్బు దొంగలు ఎత్తుకపోవడంతో బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






