అమెరికాలో 'డేలైట్‌ సేవింగ్ టైమ్'కు ఎండ్ కార్డు.. ఇక ఏడాదంతా ఒకే సమయం!

by Muthe.Rajitha |

అమెరికాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న 'డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌'కు ఎండ్ కార్డ్ పడనుంది.

అమెరికాలో డేలైట్‌ సేవింగ్ టైమ్కు ఎండ్ కార్డు.. ఇక ఏడాదంతా ఒకే సమయం!
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న 'డేలైట్‌ సేవింగ్‌ టైమ్‌'కు ఎండ్ కార్డ్ పడనుంది. అంటే అమెరికాలో ఏడాదికి రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చే విధానానికి స్వస్తి పలికి, ఏడాదంతా ఒకే సమయం ఉండేలా ఆ దేశ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూపొందించిన 'సన్‌షైన్ ప్రొటెక్షన్ యాక్ట్' బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. తాము రెండోసారి అధికారంలోకి వస్తే ఈ గడియారాల మార్పుల తిప్పల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తామని ఎన్నికల సమయంలో ట్రంప్ ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లుపై సంతకం చేయడానికి ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.

ఇక గడియారం వెనక్కి, ముందుకు తిప్పే అవసరం లేదు

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. అమెరికాలో పగటి వెలుతురును ఎక్కువగా వాడుకోవడానికి, విద్యుత్ ఆదా కోసం వేసవిలో గడియారాలను ఒక గంట ముందుకు, శీతాకాలంలో మళ్లీ ఒక గంట వెనక్కి జరుపుతుంటారు. ఈ కొత్త చట్టంతో ఇకపై అమెరికన్లు ఏడాదికి రెండుసార్లు గడియారాలను మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం మార్చి-నవంబర్ మధ్య పాటించే సమయమే (Daylight Saving Time) అమెరికాకు శాశ్వత ప్రామాణిక సమయంగా మారుతుంది.

ప్రపంచ యుద్ధాల సమయంలో మొదలు

అమెరికాలో మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో విద్యుత్ ఆదా కోసం ఈ డేలైట్ సేవింగ్ విధానాన్ని తొలిసారి ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ తర్వాత 1969లో దీనిని చట్టబద్ధం చేసి ప్రామాణీకరించారు. నాటి నుండి గత 57 ఏళ్లుగా అమెరికన్లు ఏటా రెండుసార్లు గడియారాల్లో సమయాన్ని మార్చుకుంటూ వస్తున్నారు, దీనికి ఇప్పుడు శాశ్వతంగా బ్రేక్ పడనుంది.

Next Story