రోడ్డుపై అడ్డంగా నిలబడిన విషయంలో గొడవ.. వ్యక్తి మృతి

by Kodari Anjali |

చిన్న గొడవ కాస్త ఒకరి హత్యకు దారితీసిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో జరిగింది.

రోడ్డుపై అడ్డంగా నిలబడిన విషయంలో గొడవ.. వ్యక్తి మృతి
X

దిశ, సంగారెడ్డి: రోడ్డుపై అడ్డంగా నిలబడ్డాడనే విషయంలో ఇద్దరు మధ్య గొడవ పెరిగింది. ఆ చిన్న గొడవ కాస్త ఒకరి హత్యకు దారితీసింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో నిన్న అర్థరాత్రి చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వార వివరాల ప్రకారం.. స్థానిక అంబేద్కర్ కాలనీలో నివాసం ఉండే కాశిపురం ఆంజనేయులు (టవర్ అంజి) తన కారులో అటుగా వెళ్తున్నాడు. అదే సమయంలో బూడిద రమేష్ కుమారుడు చక్రి రోడ్డుపై నిలబడటంతో "రోడ్డుపై ఇలా ఉంటే కారు ఎలా వెళ్తుంది" అనే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బూడిద రమేష్ అక్కడికి వచ్చి "నా కొడుకుతో ఎందుకు గొడవ పడుతున్నావు" అని ప్రశ్నించగా, నిందితుడు కాశీపురం ఆంజనేయులు కారుతో ముందుకు వెళ్లి, తిరిగి వచ్చి బూడిద రమేష్‌ను కారుతో బలంగా ఢీకొట్టాడు. గాయపడిన బూడిద రమేష్‌ను వెంటనే కంది బాలాజీ హాస్పిటల్ కు తరలించగా, అక్కడి వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రమేష్ మృతి చెందాడు. అనంతరం రాత్రి సుమారు 1:30 గంటలకు నిందితుడు ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే నిందితుడు అంజిపై గతంలో ఓ అటెంటు మర్డర్, గంజాయి కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ సంఘటనతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.

Next Story