AI మీద IBM కామెంట్.. గంటల వ్యవధిలో రూ.6.7 లక్షల సంపద ఆవిరి

by Muthe.Rajitha |

అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం స్టాక్ మార్కెట్లో ఘోర పతనాన్ని చవిచూసింది.

AI మీద IBM కామెంట్.. గంటల వ్యవధిలో రూ.6.7 లక్షల సంపద ఆవిరి
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) స్టాక్ మార్కెట్లో ఘోర పతనాన్ని చవిచూసింది. మంగళవారం నాటి వాల్‌స్ట్రీట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు విలువ ఒక్కరోజే 25.21% కుప్పకూలి 217.07 డాలర్లకు పడిపోయింది. దీంతో కేవలం కొన్ని గంటల్లోనే కంపెనీకి చెందిన 70 బిలియన్ డాలర్లు అంటే రూ.6.7 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఐబీఎం చరిత్రలో ఇలాంటి దారుణమైన పతనం చోటుచేసుకోవడం గత 58 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఆ ఒక్కమాట.. లక్షల కోట్లు ఆవిరి

వచ్చే వారం విడుదల కానున్న త్రైమాసిక ఫలితాల ప్రాథమిక వివరాల ప్రకారం.. కంపెనీ ఆదాయం కేవలం 1% మాత్రమే పెరిగి 17.2 బిలియన్ డాలర్లకు పరిమితం కానుంది. అలాగే, కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం 7% నష్టపోయింది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేయడంలో తాము విఫలమయ్యామని ఐబీఎం భారత సంతతి సీఈఓ అరవింద్ కృష్ణ స్వయంగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం క్లయింట్ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీపైనే భారీగా ఖర్చు పెడుతున్నాయని, ఫలితంగా ఐబీఎం సాంప్రదాయ ఉత్పత్తులు, సర్వర్లకు గిరాకీ ఒక్కసారిగా తగ్గిపోయిందని ఆయన వెల్లడించారు. AI తో వచ్చిన ఈ వేగవంతమైన మార్పును ముందే గ్రహించలేకపోయామని స్వయంగా సిఈఓ లేఖలో పేర్కొనడం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచి, అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.

Next Story