- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో పాల్వంచ చెందిన భక్తుడు పట్టాభిరామారావు విజయలక్ష్మి దంపతులు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ విరాళంగా అందజేశారు.

దిశ, ఏన్కూర్: ఖమ్మం జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయంలో పాల్వంచ చెందిన భక్తుడు పట్టాభిరామారావు విజయలక్ష్మి దంపతులు విరాళంగా అందజేసిన 50 వేల రూపాయల విలువచేసి వాటర్ ప్యూరిఫైడ్ ప్లాంట్ ను బుధవారం గార్ల ఒడ్డు సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్యూరిఫైడ్ వాటర్‌ను భక్తులుగా అందజేసే విధంగా దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రతి శని, సోమవారాలలో అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని, భక్తులకు ప్యూరిఫైడ్ వాటర్ నందు చేయడం కోసం దాతలు సహకారం దేవాలయాభివృద్ధి కోసం పాటుపడుతున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం దేవాలయాలకు స్వామివారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, వేణుగోపాల ఆచార్యులు, నాగరాజు ఆచార్యులు దేవాలయం మేనేజర్ ఎస్ వి డి ప్రసాద్, గ్రామస్తులు, భూక్య లాలు నాయక్, ప్రేలపోలు వర శంకర ప్రసాద్,గోరంట్ల రమణయ్య, దేవాలయ సిబ్బంది నారాయణరావు, శరత్, తదితరులు పాల్గొన్నారు.






