రెడ్డిపల్లిలో కల్తీ పాల దందా...

by Kodari Anjali |

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల దందా వెలుగులోనికి వచ్చింది.

రెడ్డిపల్లిలో కల్తీ పాల దందా...
X

దిశ, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో కల్తీ పాల దందా వెలుగులోనికి వచ్చింది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం కల్తీ పాలు తయారు చేసే శివన్నగారి సుధాకర్ గౌడ్ దుకాణంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పాలలో కలపడానికి ఉపయోగించే పౌడర్ తదితర ముడి సరుకును అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలను మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Next Story