- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైలెట్ కలర్ చీరలో.. చేతిలో కమలం పువ్వు.. క్యూట్ లుక్స్‌లో కట్టిపడేస్తున్న భాగ్యశ్రీ
వైలెట్ చీరలో భాగ్య శ్రీ వయ్యారాలు.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, తన అందం, అభినయంతో మంచి గుర్తింపును సంపాదించింది.
అనంతరం పలు తెలుగు చిత్రాల్లో నటించినా, భారీ విజయానికి మాత్రం దూరంగానే నిలిచింది. అయితే తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భాగ్యశ్రీకి మంచి బ్రేక్ లభించింది.
ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ భాగ్యశ్రీ తన గ్లామర్‌తో అభిమానులను కట్టిపడేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వైలెట్ రంగు చీరకు సిల్వర్ అంచు, దానికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్‌లో సంప్రదాయ లుక్‌లో మెరిసిపోయింది. రెండు చేతుల నిండా గాజులు, మెడలో అందమైన హారం, స్టైలిష్ ఇయర్‌రింగ్స్, విరబోసిన జుట్టుతో మరింత ఆకర్షణీయంగా కనిపించింది.
చేతిలో కమలం పువ్వు పట్టుకుని ఇచ్చిన హోయలపోయే పోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. మొత్తంగా ఈ ఫోటోల్లో భాగ్యశ్రీ ట్రెడిషనల్ గ్లామర్‌తో మెస్మరైజ్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Photos Courtesy: Instagram






