- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాగజ్ నగర్ ZPHSలో అగ్నిప్రమాదం.. స్కూల్లో 450 మంది విద్యార్థులు?
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZPHS) లో బుధవారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ZPHS) లో బుధవారం ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాఠశాల వంటగదిలో గ్యాస్ లీక్ కావడంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో దాదాపు 450 మంది విద్యార్థులు ఉన్నారు. ఉపాధ్యాయుల అప్రమత్తత, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. మధ్యాహ్న భోజన పథకం కింద వంట మనుషులు వంట చేస్తున్న సమయంలో వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. క్షణాల వ్యవధిలోనే మంటలు వంటగది మొత్తం వ్యాపించాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన వంట సిబ్బంది వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.
విద్యార్థులు సేఫ్..
ప్రమాద తీవ్రతను గమనించిన ఉపాధ్యాయ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే తరగతి గదుల్లో ఉన్న సుమారు 450 మంది విద్యార్థులను ఏ విధమైన తొక్కిసలాట జరగకుండా సురక్షితంగా పాఠశాల మైదానం దాటించి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. అనంతరం వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది వంటగదిలో చెలరేగిన మంటల్ని అదుపుచేశారు. సకాలంలో మంటలను అదుపు చేయడంతో సిలిండర్ పేలకుండా రక్షించగలిగారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






