- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల కొండపై ఉత్కంఠ.. భారీ భద్రతా కసరత్తుల మధ్య ఆక్టోపస్ దళాల మాక్ డ్రిల్స్
తిరుమల కొండపై ఉత్కంఠ నెలకొంది. భారీ భద్రతా కసరత్తుల మధ్య ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. శ్రీవారి భక్తుల భద్రత ప్రధాన లక్ష్యంగా కొండపై కమాండోలు ప్రత్యేక విన్యాసాలు చేపట్టారు.

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల కొండపై ఉత్కంఠ నెలకొంది. భారీ భద్రతా కసరత్తుల మధ్య ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. శ్రీవారి భక్తుల భద్రత ప్రధాన లక్ష్యంగా కొండపై కమాండోలు ప్రత్యేక విన్యాసాలు చేపట్టారు. ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను ఎలా గుర్తించాలి, దాడుల సమయంలో భక్తులను సురక్షితంగా ఎలా తరలించాలి అనేదానిపై ప్రత్యేక సాధన నిర్వహించారు. పోలీస్, టీటీడీ విజిలెన్స్ విభాగాలతో కలిసి సమన్వంతో ఈ ఆక్టోపస్ మాక్ ఆపరేషన్ కొనసాగింది. ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన సమయంలో, దాడులు జరిగే సమయంలో ఎలా వ్యవహరించాలో, ఎలా తప్పించుకోవాలో తెలిపేందుకు భద్రతా దళాలు, పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ఉంటాయి. దీని వల్ల ప్రజల్లో ఒక అవగాహన కలుగుతుంది.
Next Story






