- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాతబస్తిలో అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు..
పాతబస్తిలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్ బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

దిశ, చంపాపేట్: పాతబస్తిలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించే లక్ష్యంతో చార్మినార్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఖరే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్ బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. నైట్ పోలీసింగ్‌లో భాగంగా యాకుత్‌పురా, రైన్‌బజార్, సంతోష్‌నగర్, రక్షాపురం, మొయిన్‌బాగ్, గంగానగర్ నాలా ప్రాంతాలను సందర్శించిన డీసీపీ, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది అప్రమత్తతను పరిశీలించారు. రాత్రి పెట్రోలింగ్ ఎలా కొనసాగుతోంది, వాహనాల తనిఖీలు ఎంత సమర్థవంతంగా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాత్రి వేళల్లో సేవలందిస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులను తనిఖీ చేసి అక్కడి భద్రతా ఏర్పాట్లు, అత్యవసర వైద్య సేవల అందుబాటు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. రాత్రి సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలకు వెంటనే సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో నేరాలను అరికట్టడంలో నైట్ పెట్రోలింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజలకు భరోసా కలిగించే విధంగా విధులు నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాతబస్తిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలతో రాత్రి వేళల్లో పోలీసు వ్యవస్థ మరింత అప్రమత్తంగా పనిచేస్తోందనే భరోసా ప్రజల్లో వ్యక్తమవుతోంది.






