ఇకపై మామూలు సినిమాలు చేయను.. సైకో పాత్ర చేయడమే నా టార్గెట్.. కృతి సనన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

ముఖ్యంగా ఒక సైకో పాత్రలో నటించాలనేది తన విష్‌లిస్ట్‌లో టాప్‌లో ఉందని కృతి సనన్ చెప్పారు.

ఇకపై మామూలు సినిమాలు చేయను.. సైకో పాత్ర చేయడమే నా టార్గెట్.. కృతి సనన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి సనన్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల తేరే ఇష్క్ మే, కాక్‌టెయిల్-2 వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ మల్టీస్టారర్ మూవీ ‘నో ఎంట్రీ సీక్వెల్’లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సక్సెస్‌లను ఎంజాయ్ చేస్తున్న కృతి తాజాగా, చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇకపై తాను రొటీన్, సేఫ్ జోన్ సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో సరికొత్త ప్రయోగాలు చేస్తూ, సైకలాజికల్‌గా ఎంతో క్లిష్టంగా ఉండే పాత్రల్లో నటించడమే తన లక్ష్యమని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె తన మనసులోని కోరికను బయటపెట్టారు. ముఖ్యంగా ఒక సైకో పాత్రలో నటించాలనేది తన విష్‌లిస్ట్‌లో టాప్‌లో ఉందని కృతి సనన్ చెప్పారు. నటులుగా మన నిజ జీవితానికి పూర్తిగా భిన్నంగా ఉండే పాత్రలు చేసినప్పుడే అసలైన మజా వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

‘అబ్సెషన్’ అనే సిరీస్ చూసిన తర్వాత తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆమె వివరించారు. ఆ సిరీస్ చూస్తున్నప్పుడు, మనం సేఫ్ గేమ్‌ ఆడటం ఆపేసి, సరికొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని తనకు అనిపించిందని, అది తనను ఎంతో ఎగ్జైట్ చేసిందని చెప్పారు. అలాగే హాలీవుడ్ నటి జెండయా నటన, ఆమె ఎంచుకునే వైవిధ్యమైన పాత్రలు కూడా తనను ఎంతగానో ఇన్స్‌పైర్ చేశాయని పేర్కొన్నారు. తాను ఎందుకు ఇలాంటి భిన్నమైన పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారో చెప్తూ.. తనకు ఒక సైకో అమ్మాయిలా నటించాలని ఉందని చెప్పారు. నటులుగా మనకు సంబంధం లేని ఒక సరికొత్త వ్యక్తిత్వాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించడం, వారి జీవితాన్ని జీవించడం ఎంతో కిక్ ఇస్తుందని అన్నారు. ఇలాంటి సైకలాజికల్ పాత్రల వల్ల ప్రేక్షకులు కూడా సాధారణ జీవితంలో చూడని సరికొత్త కోణాలను, అనుభూతులను స్క్రీన్ పై ఎక్స్‌పీరియన్స్ చేయగలరని కృతి చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇదేం కోరిక అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story