- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మమ్మే అమ్మేయమందా.. బిక్షాటన గ్యాంగ్‌కు, మరిపెడకు సంబంధమేంటి?
నేలకొండపల్లిలో పోలీసులు రెస్క్యూ చేసిన చిన్నారి కేసులో విస్తుపోయే నిజాలున్నట్లు బయటకు వచ్చాయి.

దిశ, నేలకొండపల్లి: రాత్రి వేళ ఆగంతుకుని చేతిలో ఏడుస్తూ, బిక్కుబిక్కు మంటూ పసిపాప ఉందన్న డయల్ 100 సమాచారంతో సోమవారం రాత్రి నేలకొండపల్లి పోలీసులు రెస్క్యూ చేసిన చిన్నారి కేసులో విస్తుపోయే నిజాలున్నట్లు సమాచారం అందుతుంది. 2 నుండి 3 ఏళ్ళ పసిపాపను చెన్నై తరలించి అక్కడ బిక్షాటన చేపించే గ్యాంగ్ లకు అమ్మేసేందుకే ప్రణాళికబద్దంగా పాప అమ్మమ్మ, మేనమామతో తరలిస్తున్నట్లు తెలిసింది. మహాబాద్ జిల్లా మరిపెడ మండలంకు చెందిన పాపతో మేనమామ బస్సులో కోదాడ వైపు వెళ్తుండగా, ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్న ఆ చిన్నారిని మద్యం మత్తులో కొడుతుంటే, బస్సు డ్రైవర్ నేలకొండపల్లిలో ఆహారం పెట్టించాలంటూ మందలించి దించి వేశాడని సమాచారం. దీంతో అక్కడ బోదులబండ క్రాస్ రోడ్ లోని ఓ రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి చిన్నారితో తచ్చాడుతుండగా అనుమానంతో యజమాని డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో బ్లూకోల్ట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు శివలాల్, నిఖిల్ పాపను ఆ వ్యక్తి వద్ద నుండి రెస్క్యూ చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించారనేది ఆయా సోషల్ మీడియా మాధ్యమాలలో, పోలీసులు చెప్తున్నట్లుగా టాక్.
మున్ముందు చిన్నారి కేసులో...
అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు కానీ, చర్యలు కానీ పోలీసులు తీసుకోలేదు. నేలకొండపల్లి పోలీసుల చెంతకు చేరిన చిన్నారి ఘటనలో సంచలన విషయాలే ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు నారాయణపురంకు చెందిన పాప తండ్రి మరణించగా, తల్లి మాత్రం వేరొకరితో సహజీవనం చేస్తుండగా, చిన్నారి అమ్మమ్మ ఆలనాపాలనా చూస్తున్నట్లు తెలిసింది. అయితే పెంపకం భారమవటంతో పాప మేనమామకు ఇచ్చి చెన్నైలో భిక్షాటన గ్యాంగులకు అమ్మేసేందుకు పురమాయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పాపను తీసుకెళ్తున్న మేనమామ ఎపిసోడ్ నేలకొండపల్లి చేరింది. అయితే అసలు విషయాలను పూర్తి స్థాయిలో విచారించకుండానే పోలీసులు చిన్నారిని మళ్లీ అమ్మమ్మకే అప్పచెప్పి చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఘటన పూర్వాపరాలను, వాస్తవాలను పూర్తిగా పరిశీలిస్తే చిన్నారులను చెన్నై తరలిస్తూ బిక్షాటన రాకెట్ గ్యాంగ్ లకు అమ్మే గుట్టు బయటపడే అవకాశం పోలీసులు వదులుకున్నారా అనే సంశయం కల్గుతుంది. మరి మున్ముందు చిన్నారి కేసులో వాస్తవాలను గ్రహించి దర్యాప్తు చేస్తారా, ఇంతటితో సరిపెడతారా అనేది వేచిచూడాలి మరి.






