ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌‌‌గా ఉన్నాను.. 14 నెలల శ్రమ గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

ఈ సినిమా షూటింగ్ అనుభవాలను, రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం కోసం తాను గత 14 నెలలుగా పనిచేస్తున్నట్లు ప్రియాంక వెల్లడించారు.

ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌‌‌గా ఉన్నాను.. 14 నెలల శ్రమ గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమాలో కనిపించనున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తన తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో రాబోతున్న ‘వారణాసి’ సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2027లో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ తప్ప ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ప్రియాంక, ఈ సినిమా షూటింగ్ అనుభవాలను, రాజమౌళి వర్కింగ్ స్టైల్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం కోసం తాను గత 14 నెలలుగా పనిచేస్తున్నట్లు ప్రియాంక వెల్లడించారు.

సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం ఎక్కువ సమయం తీసుకుంటారని, ఈ కథ ప్రపంచవ్యాప్తంగా సాగే ఒక అద్భుతమైన టైమ్ ట్రావెల్ అడ్వెంచర్ అని చెప్పారు. సినిమాలో తాను ఎన్నో అద్భుతమైన స్లో-మోషన్ జంప్స్ సీన్స్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత తాను ఇండియన్ స్క్రీన్ పైకి వస్తుండటంతో, ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు తెలిపారు. మూవీ విశేషాల గురించి మాట్లాడుతూ.. రాజమౌళి సృష్టించే ప్రపంచం చాలా విభిన్నంగా, లార్జర్ ద్యాన్ లైఫ్‌లా ఉంటుందని ప్రియాంక ప్రశంసించారు. అంటార్కిటికా వంటి అద్భుతమైన ప్రాంతాలలో ఈ సినిమాను షూట్ చేశారని చెప్పారు. ఆల్రెడీ చేసిన ఒక సాంగ్ కొరియోగ్రఫీ చాలా అద్భుతంగా, క్లిష్టంగా వచ్చిందని, మిగిలిన సాంగ్ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Next Story