- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మండాడి’ రిలీజ్ వాయిదా.. సడెన్ ట్విస్ట్ ఇస్తూ డబుల్ అప్‌డేట్స్ ఇచ్చిన మూవీ మేకర్స్
‘మండాడి’ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుపుతూ.. కొత్త రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు.

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మండాడి’. ఈ సినిమాతో సుహాస్ తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, తీర ప్రాంతం, మత్స్యకారుల జీవన విధానం బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్చుత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 4న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో ఇరు పరిశ్రమలకు చెందిన సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈనేపథ్యంలో.. తాజాగా మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఒక సడెన్ ట్విస్ట్ ఇస్తూ, సోషల్ మీడియా వేదికగా డబుల్ అప్‌డేట్స్‌ను పంచుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘మండాడి’ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుపుతూ.. కొత్త రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. రిలీజ్ డేట్ మార్పుతో పాటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను జూలై 18న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ప్రోమో డేట్ చెప్పినప్పటికీ.. పూర్తి పాటను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. ఈ అప్‌డేట్‌తో పాటు విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులో హీరోలు సుహాస్, సూరి ఇద్దరూ మాస్ స్టెప్ వేస్తూ.. తమ ముఖాలను కోట్‌తో కవర్ చేసుకుని కనిపించడం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది.






