జమ్మికుంటలో విషాదం.. రైలు కింద పడి కేబుల్ ఆపరేటర్ మృతి

by Kodari Anjali |

జమ్మికుంట రైల్వే స్టేషన్లో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

జమ్మికుంటలో విషాదం.. రైలు కింద పడి కేబుల్ ఆపరేటర్ మృతి
X

దిశ, జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్లో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడిని జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కేబుల్ ఆపరేటర్ దాసరి రామ్మూర్తి గౌడ్ గా పోలీసులు గుర్తించారు. ఆయన ఎలా రైలు కిందపడ్డారనే దానిపై పూర్తి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రమాదమా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Next Story