ఈ క్షణం కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా.. సమంత ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

అయితే ఈ క్షణం కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఎప్పటి నుంచో తల్లి కావాలనే బలమైన కోరిక తనలో ఉందని వెల్లడించారు.

ఈ క్షణం కోసం నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా.. సమంత ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల డబుల్ గుడ్ న్యూస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. చాలాకాలం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో వచ్చిన ఆమె బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించారు. ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేయగా.. సమంత, రాజ్ నిడిమోరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2025 డిసెంబర్‌లో కొయంబత్తూరు‌లోని ఈషా యోగా సెంటర్‌లో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్న ఈ జంట త్వరలో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. చాలా ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సామ్.. మాతృత్వాన్ని, తన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ మాతృత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇది తనకు పూర్తిగా కొత్తగా, ఎంతో ఉత్సాహంగా ఉందని చెప్పారు.

అయితే ఈ క్షణం కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఎప్పటి నుంచో తల్లి కావాలనే బలమైన కోరిక తనలో ఉందని వెల్లడించారు. అందుకే ఈ కొత్త బాధ్యత కోసం ఒక తల్లిగా తన వంద శాతం శ్రమను అందిస్తానని నమ్మకంగా చెప్పారు. అంతేకాకుండా, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తనలో ఒక కొత్త రకమైన శక్తి, జీవితానికి ఒక స్పష్టమైన గమ్యం దొరికినట్లు అనిపిస్తోందని సమంత పేర్కొన్నారు. ఈ మాతృత్వ ప్రయాణం కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, రాబోయే రోజులను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం వంద కోట్ల వసూళ్లతో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించగా, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఆమె తల్లిగా సరికొత్త అడుగు వేస్తుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Next Story