యాదాద్రి పవర్ ప్లాంట్ లో కమీషన్ల దందా..ప్రతినెల రూ. 10 లక్షల వరకు వసూళ్లు...?

by Ajay Maddhiboyina |

పవర్ ప్లాంటు నిర్మాణంలో వేలాది మంది కార్మికులు నిత్యం నిమగ్నమై పనిచేస్తున్నారు. కార్మికులను సరఫరా చేయడానికి కొంత మంది కాంట్రాక్టర్లు పవర్ ప్లాంటులో ఉన్నారు. ప్లాంటు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన ఓ అధికారి ఆ కాంట్రాక్టర్ నుంచి ప్రతి నెల కమీషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

యాదాద్రి పవర్ ప్లాంట్ లో కమీషన్ల దందా..ప్రతినెల రూ. 10 లక్షల వరకు వసూళ్లు...?
X

దిశ నల్లగొండ బ్యూరో: పవర్ ప్లాంటు నిర్మాణంలో వేలాది మంది కార్మికులు నిత్యం నిమగ్నమై పనిచేస్తున్నారు. కార్మికులను సరఫరా చేయడానికి కొంత మంది కాంట్రాక్టర్లు పవర్ ప్లాంటులో ఉన్నారు. ప్లాంటు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన ఓ అధికారి ఆ కాంట్రాక్టర్ నుంచి ప్రతి నెల కమీషన్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కమీషన్ ఆలస్యమైన, ఇవ్వకపోయిన రకరకాల కారణాలు చెప్పి పని ముందుకు సాగకుండా అడ్డుపడుతుంటారని తెలుస్తోంది. రక్షణగా ఉండాల్సిన అధికారులే దోచుకుంటుంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానీ స్థితిలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు. కంచె చేను మేసినట్లుగా అక్కడ వసూళ్ల దందా కొసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

--- నిర్మాణంలో 5వేల మంది కార్మికులు...

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ( వైటిపిఎస్) నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలంలోని వీర్ల పాలెం/ తాళ్ల వీరప్పగూడెంలో ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా భారీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం . దీని మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 4వేల మెగవాట్లు. అంటే మొత్తం ఐదు యూనిట్లు. ఐదు యూనిట్లు.. ఒక్కొక్కటి 800 యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇలాంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో90 నుంచి 100 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం సుమారు 4 నుంచి 5వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అనేక వాహనాలు కూడా ఈ పనిలో ఉపయోగిస్తుంటారు.అయితే ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులకు, వాహనాలకు ఇన్-- అవుట్ ( లోపలికి వచ్చి పోవడానికి) పాసులు ప్రతి నెలకు ఒకసారి అందజేస్తుంటారు. గతంలో మూడు నెలలకు ఒకసారి ఇచ్చే వారు. కానీ గత కొద్ది రోజులుగా నెలకు ఒక్కసారి మాత్రమే ఇస్తున్నారు. ప్లాంటులో బయటివారు లోపలికి ఎవరూ రాకుండా అనుమతి లేకుండా వస్తే గుర్తించడానికి ఈ కార్డులను ఉపయోగిస్తుంటారు.

కాంట్రాక్టర్ నుంచి వసూళ్లు.....

థర్మల్ పవర్ ప్రాజెక్టు పనిలో మొత్తం సుమారు 90 మంది 100 మంది కాంట్రాక్టర్లు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు సంబంధించిన కార్మికులు, వాహనాలు, తదితర వాటికి గేటు పాసులు తప్పని సరి. అయితే ఆ పాసులు ఇవ్వాలంటే ప్లాంటుకు రక్షణ కల్పించే స్థానంలో అధికారి ఆదేశాల మేరకు అందజేస్తుంటారు. అయితే పాసులు అందచేసే ముందు ప్లాంటులో పనిచేసే కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్ స్థాయిని బట్టి రూ. 5వేల నుంచి 12వేల వరకు వసూలు చేస్తున్నట్లు వినికిడి. అంటే 100మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.5వేలు వసూలు చేస్తేనే ప్రతి నెలకు రూ. 5లక్షలు అవుతుంది. అంటే దాదాపు ఆ కీలక అధికారికి ప్రతినెల రూ. 5 నుంచి 10 లక్షల వరకు అక్రమ సంపాదన అందుతుందని ప్లాంటులో పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. గతంలో మూడు నెలలకు ఒకసారి మాత్రమే గేటు పాసులు ఇచ్చేవారు.. కానీ అక్రమ సంపాదన తగ్గుతుందనే దురాలోచనతో ప్రతి నెల కార్డులు అందజేసే విధానాన్ని అ అధికారి అమలు చేసినట్లు చర్చ జరుగుతుంది. ఆ కీలక అధికారి కాంట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లలో సూత్రధారి అయితే అందులో పనిచేసే మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు పాత్రధారులు తమ పనిని కొనసాగిస్తూ వసూళ్లు చేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం.

పెత్తనమంతా ఆయనదే....?

ఆయన ఓ కాంట్రాక్టర్ కాదు... రక్షణ శాఖలో పనిచేసే ఉద్యోగి కాదు.... విద్యుత్ ప్లాంటులో పనిచేసే ఇంజనీరు కాదు.. కనీసం లేబర్ పని కూడ చేయడు. కానీ అక్కడ పెత్తనమంతా ఆయనే చెలాయిస్తుంటారు. ఆయన రక్షణ శాఖలో ఉన్న కీలక అధికారికి నిత్యం నీడలా వెన్నంటి ఉంటారని చర్చ జరుగుతుంది. అక్రమంగా వసూలు చేసే సొమ్ములో కీలక సూత్రధారికి .. ముగ్గురు పాత్రధారులకు మద్య నారాదుడి పాత్ర పోషిస్తున్నట్లు వినికిడి. ఏ కాంట్రాక్టర్ నుంచి ఎంత వసూలు చేయాలో అతనే నిర్ణయిస్తారని తెలుస్తోంది. వీళ్లిద్దరి మద్య సంబందం రక్షణ శాఖ అధికారి గతంలో పనిచేసిన చోటు నుంచి వీరి బంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఆ బందాన్ని అడ్డుపెట్టుకుని పవర్ ప్లాంటులో అందరిపై పెత్తనం చేస్తారని సమాచారం. అంతేగాకుండా అధికారితో ఉన్న సంబందంతో సబ్ కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తామని కూడ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Next Story