బాలీవుడ్‌కు 'ఆల్ఫా' ఫలితం గట్టి హెచ్చరికేనా?

by Pulgam srinivas |

బడ్జెట్ కాదు.. కంటెంట్‌నే కింగ్.. బాలీవుడ్‌కు మరో గుణపాఠం.

బాలీవుడ్‌కు ఆల్ఫా ఫలితం గట్టి హెచ్చరికేనా?
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎన్నో స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో చాలావరకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ముఖ్యంగా స్పై యూనివర్స్ చిత్రాల నిర్మాణంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ముందంజలో ఉంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన పలు స్పై చిత్రాలు భారీ విజయాలను నమోదు చేశాయి. అయితే ఇటీవల ఈ బ్యానర్ రూపొందించిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక వరుస పరాజయాలను చవిచూస్తున్నాయి.

తాజాగా ఆలియా భట్ ప్రధాన పాత్రలో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన 'ఆల్ఫా' కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేక నిరాశపరిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మరోవైపు తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కొన్ని చిత్రాలు బలమైన కథ, కంటెంట్‌తో మంచి విజయాలు సాధిస్తున్నాయి. దీంతో భారీ ఖర్చు కంటే ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌కే ప్రాధాన్యం ఇవ్వాలని, బాలీవుడ్ ఈ పరిణామాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story