ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బృందం

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ పార్టీ బృందంతో క‌లిసి ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి బ‌య‌లుదేరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌లు, ఉక్కుశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని వారు క‌ల‌వ‌నున్నారు.

ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బృందం
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ బృందంతో క‌లిసి ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి బ‌య‌లుదేరారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌లు, ఉక్కుశాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామిని వారు క‌ల‌వ‌నున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పున‌రుద్ధ‌రించాల‌ని కేంద్ర మంత్రిని కోరనున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఖానాపూర్ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు జాన్స‌న్ నాయ‌క్, సీసీఐ సాధ‌న స‌మితి నాయ‌కులు కేంద్ర‌మంత్రితో భేటీ అవుతారు. అనంత‌రం ఢిల్లీలో నిర్వ‌హించే మీడియా స‌మావేశంలో నాయ‌కులు పాల్గొంటారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1984 నుండి పనిచేసి 1998లో కార్యకలాపాలు నిలిపివేసింది. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో దీనిని పునరుద్దరించి 3వేల మందికి ఉపాధి కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సైతం వారికి మద్దతుగా కేంద్రమంత్రికి వినతీపత్రం అందించేందుకు సిద్ధమైంది.

Next Story