- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మహిళా నేత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మహిళా నేత పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రెండు రోజుల్లో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. వివరణ ఇవ్వకపతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉంటే యాదగిరిగుట్ట పాలకమండలి సభ్యురాలిగా ఈశ్వరమ్మ యాదవ్ పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎల్బీనగర్ లో ప్లెక్సీ ఏర్పాటు చేశారు.
ప్లెక్సీలో తన తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదంటూ ఈశ్వరమ్మ యాదవ్ మనవుడు సురేష్ యాదవ్‌కు ఫోన్ చేసిన శివచరణ్ రెడ్డి బూతులు తిటనట్టు ఆడియో వైరల్ అవుతోంది. దీంతో బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీసీ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తావా అంటూ సంఘాలు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశాయి. శివ చరణ్ రెడ్డిని పదవి నుండి తప్పించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు శివ చరణ్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం రూ.7 కోట్లు ఖర్చు చేశామని చెప్పినట్టు మరో ఆడియో వైరల్ అవుతోంది. ఇరువురిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జాతీయ యూత్ కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.






