- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు.. ఆదేశాలు జారీ
by Naga Rani Yarlagadda |
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) ఆకస్మిక మరణం ఏపీ రాజకీయాల్లో తీరని విషాదాన్ని నింపింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (73) ఆకస్మిక మరణం ఏపీ రాజకీయాల్లో తీరని విషాదాన్ని నింపింది. కొంతకాలంగా కిడ్నీ, శ్వాస సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధ్యక్షుడు జగన్ తదితర రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కాగా.. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఫోన్ లో చర్చించి తుదినిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయం కిర్లంపూడిలోని నివాసంలో ఉండగా.. పలువురు రాజకీయ నేతలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
Next Story






